విలన్‌గానే కాక
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఫుల్ బిజీగా ఉన్న జగపతిబాబు వరుస అవకాశాలతో
దూసుకెళ్తున్నాడు. స్టార్ హీరోలు మొదలు కుర్రహీరోల సినిమాల వరకూ తండ్రి
పాత్రకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన జగ్గూభాయ్ ఈసారి మెగాహీరోకు ఫాదర్‌గా
నటించనున్నాడట. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'పిల్లా నువ్వు లేని
జీవితం'లో జగపతిబాబు కీలకపాత్ర పోషించాడు. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్
కూడా ఈ సినిమాలో బాగా పేలాయి. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ సినిమా
తెరకెక్కనుందని సమాచారం. సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని
తెరకెక్కించనున్న చిత్రంలో హీరో తండ్రి క్యారెక్టర్ కోసం జగపతిబాబును
సంప్రదించారట. తండ్రి క్యారెక్టర్‌కు ఈ సినిమాలో ఉన్న ప్రాధాన్యత వల్లే
జగపతిబాబును కలసి కథతో పాటు క్యారెక్టర్ గురించి విన్పించాడట దర్శకుడు
గోపీచంద్. జగ్గూభాయ్‌కు కూడా పాత్ర నచ్చడంతో సానుకూలంగా స్పందించినట్టు
సమాచారం.

No comments:
Post a Comment