చెన్నై: పబ్లిక్,
ప్రైవేటు రంగ బ్యాంకు ఉద్యోగులు జులై 29న సమ్మె చేయడానికి నిర్ణయించినట్లు
అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) వెల్లడించింది. కేంద్రం ప్రజా
వ్యతిరేకంగా బ్యాంకు పాలసీల్లో చేస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా జులై
29 రోజున ఉద్యోగులంతా సమ్మె చేయనున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా 9
ట్రేడ్ యూనియన్స్ కలిసిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్‌లోని
పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. పబ్లిక్ సెక్టార్
బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని, బ్యాంకింగ్ సెక్టార్‌లో విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడులు వద్దని, ఇంకా పలు డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నారు.

No comments:
Post a Comment