జంటనగరాలలో
శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈనెల 14 నుంచి 20
వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. పోలీసుల అనుమతి లేకుండా నగరంలో బహిరంగ సభలు,
ఎక్కువ శబ్ధంతో కూడిన మైకులు వాడకూడదు.
కర్రలు, రాళ్లు, కత్తులు,
తుపాకులు వంటి మారణాయుధాలతో సంచరిస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.
అసెంబ్లీ, సచివాలయం, పబ్లిక్‌గార్డెన్, నిజాం కళాశాల చుట్టుపక్కల
ప్రాంతాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే... బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఇబ్బందులు సృష్టించే వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోనున్నారు. చిన్నారులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తారు. బుధవారం నుంచి ఈనెల 19 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:
Post a Comment