Saturday, 2 July 2016

ఆరోగ్యశ్రీపై కొలిక్కిరాని మంత్రి చర్చలు

ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆరోగ్యశ్రీ అంశంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిర్వహించిన చర్చలు ఓ కొలిక్కిరాలేదు. ఆదివారం మధ్యాహ్నం తమ నిర్ణయం చెబుతామని ఆస్పత్రి యాజమాన్యాలు మంత్రికి స్పష్టంచేశాయి. ఆరోగ్యశ్రీ విషయంపై చర్చించేందుకు ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో మంత్రి భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఈ చర్చల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆస్పత్రుల ఖాతాల్లోకి నిధులు చేరుతాయని హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment