నాగ్‌తో
శ్రీకాంత్ తనయుడి ఛాలెంజ్
‘నిర్మలా కాన్వెంట్’ ట్రైలర్ విడుదల
‘నిర్మలా కాన్వెంట్’ ట్రైలర్ విడుదల
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిర్మల కాన్వెంట్’. నాగార్జున అతిథి పాత్రలో కనిపించనున్న ఈ చిత్ర డిజిటల్ ట్రైలర్‌ను శనివారం నాగార్జున సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇది స్వచ్ఛమైన ప్రేమ కథని, తనకు ప్రేమ కథలంటే ఇష్టమని నాగ్ తెలిపారు. ఈ ట్రైలర్ నాగ్ మార్క్‌తో అందంగా ఉంది. నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేశారు. హీరోగా నటిస్తున్న రోషన్ పేరు శామ్యుల్ అని.. హీరోయిన్ శ్రేయాశర్మ పేరు శాంతి అని వీరు లవ్‌లో పడినట్టు చెబుతారు. కానీ శామ్యుల్ తననే ఛాలెంజ్ చేశాడని, చూద్దాం..గెలుపెవ్వరిదో అని నాగ్ ట్రైలర్‌లో చెప్పారు. రోషన్ నటన ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జి. నాగకోటేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రేయాశర్మ నాయిక. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ తెలిపారు. అనితా చౌదరి, సమీర్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతమందిస్తుండగా, స్వర మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ తనయుడు అమీన్ ఇందులో ఓ పాట పాడడం విశేషం.

No comments:
Post a Comment